
భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) తాజ్ కృష్ణాలో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని.. ప్రతిపక్షాల అభ్యర్థినని నొక్కిచెప్పారు సుదర్శన్ రెడ్డి.