
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం మరోసారి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఒకలా ఉండగా, ఫలితాలు మరోలా వచ్చాయని, దీనివల్ల ఎన్నికల్లో మోసం జరిగిందన్న
అనుమానాలకు బలమొచ్చిందన్నారు. మహారాష్ట్రలో 40 లక్షలకుపైగా అనుమానాస్పద ఓటర్లు ఉన్నారని “ఈ అనుమానాస్పద ఓటర్లను ఎన్నికల సంఘం ఎందుకు కాపాడుతోంది? ఇది ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి చేసిన కుట్ర. ఎన్నికల డేటాను ఎలక్ట్రానిక్‌గా ఎందుకు ఇవ్వడం లేదు?” అన్నారు.