ఎన్టీఆర్ భవన్లో కాఫీ కబుర్లు పేరుతో నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో చంద్రబాబు కాఫీ కబుర్లు చెప్పారు. శిక్షణ కార్యక్రమాలు ఎలా జరిగాయని అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన శిక్షణ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కూడా తమ నాయకత్వాలను మెరుగు పరుచుకోవాలని సీఎం సూచించారు. పార్టీ సిద్దాంతాలు, భావజాలం ప్రతి కార్యకర్తకు తెలియాల్సిన అవసరం ఉందని సీఎం వెల్లడించారు.

