పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. లోక్‌సభలో ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. 2025 సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును సవరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. హెల్త్ సెక్యూర్టీ, నేషనల్ సెక్యూర్టీ సెస్ బిల్లును కూడా మంత్రి ప్రవేశపెట్టారు. జాతీయ భద్రత, ప్రజా ఆరోగ్యం కోసం నిధులను పెంచాలని కోరుతూ బిల్లును రూపొందించారు.
మణిపూర్‌కు చెందిన జీఎస్టీ సవరణ బిల్లును కూడా మంత్రి నిర్మల సభలో ప్రవేశపెట్టారు.

