‘ఎంజీనరేగా’ను చంపేశారు. ఇప్పుడు ఆర్‌టీఐ వంతు వచ్చిందా?’ అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆర్థిక సర్వే నివేదికలో ఆర్‌టీఐ చట్టాన్ని పునఃపరిశీలించాలని సూచించిన నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్‌టీఐ చట్టాన్ని బలహీనపరుస్తోందని ఖర్గే ఆరోపించారు. నిజాన్ని బయటపెట్టే వారికి భయాందోళనసు కలిగించే పరిస్థితులను తీసుకొచ్చిందని విమర్శించారు 2014 నుంచి ఇప్పటి వరకు 100 మందికి పైగా ఆర్‌టీఐ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆయన ఆరోపించారు.

