
కోలీవుడ్ నటుడు విశాల్, ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 47 ఏళ్ల వయసులో ప్రేయసి సాయి ధన్సికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు విశాల్. వధూవరుల కుటుంబాలతో పాటు అతికొద్ది మంది ఆత్మీయ అతిథుల మధ్య సాయి ధన్సిక, విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది. ‘నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు సాయి ధన్సికతో నా ఎంగేజ్మెంట్, మా ఇరువురి కుటుంబసభ్యుల మధ్య జరిగిందనే శుభవార్త, మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేశాడు విశాల్..