
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. భయంకరమైన రీతిలో నది ఉధృతంగా ఉరకలేస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ముఖ్యంగా చాదర్ఘాట్ ప్రాంతంలోని మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఇండ్లను మూసీ వరద ముంచెత్తింది. దీంతో స్థానికులను రెవెన్యూ అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో స్థానికులు కట్టుబట్టలతో బయటపడ్డారు.