రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కార్యకర్తల సమావేశంలో మోదీ సర్కార్ తీరును ఎండగట్టారు. మోదీ విధానాలు కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉన్నాయని “ప్రధాని మోదీకి ఉపాధి హామీ పథకం అంటే గిట్టదు. ఈ పథకాన్ని ఎగతాళి చేశారు. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తేయాలని చూస్తున్నారు. పేద కార్మికులకు దక్కాల్సిన డబ్బును, అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు మళ్లించడమే ఆయన లక్ష్యం.దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండాలని మోదీ కోరుకుంటున్నారు. మేం పేదలను కాపాడుతుంటే,మోదీ వారి పొట్ట కొడుతున్నారు” అని విమర్శించారు.

