మధ్యప్రదేశ్ లోని అధ్మాత్మిక నగరం ఉజ్జయినిలో భారీ హింస చెలరేగింది. గురువారం రాత్రి వీహెచ్పీ నేతపై గుర్తుతెలియని వ్యక్తుల దాడితో చెలరేగిన అల్లర్లు రెండో రోజు కూడా కొనసాగాయి. అల్లరి మూకలు పలు బస్సులకు నిప్పుపెట్టాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటన తరువాత పోలీసులు ఉజ్జయినిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అల్లర్లతో సంబంధం ఉన్న 12 మందిని అరెస్ట్ చేశారు. ఉజ్జయిని బస్టాండ్లో దూరిన అల్లరమూకలు విధ్వంసం సృష్టించాయి. 15 బస్సులను తగలబెట్టారు.

