
దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదా? మీకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం ఇచ్చినా టైం ముగుస్తుంది. ఎందుకంటే రెండో విడత సిలిండర్ బుకింగ్ గడువు జూలై 31తో ముగియనుంది. ఇంకా బుక్ చేసుకోని వారు తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. గడువు దాటి బుకింగ్ చేసుకోవడం సాధ్యపడదు. మూడో విడత బుకింగ్ ప్రారంభం కానుంది. లబ్ధిదారులు ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వ తేదీ వరకు తమ ఉచిత గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.