ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీ అమలుకు నిర్ణయించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలు మార్గదర్శకాలు ఖరారు చేసారు. ఏటా మూడు సిలిండర్ల అందించేలా క్యాలెండర్ నిర్ణయించారు. అదే విధంగా తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా పథకం అమలు కానుంది.