
పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతుంది. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో నిర్మించిన ఆరు థియేటర్లు నిర్మాణపు పనులు, 95శాతం పూర్తయి అతి త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.అవయవాల మార్పిడికోసం ఆరు మాడ్యులర్ ఆపరేషన్ థీయేటర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి మూడు వివిధ రకాల అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. పీజీ విద్యార్థులకు వైద్యవిద్యలో భాగంగా ఆపరేషన్ థియేటర్లో నిర్వహించే అవయవ మార్పిడి చికిత్సను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాటు చేశారు. వీటిల్లోనే నేరుగా దాత నుంచి గ్రహీతకు అవయవాన్ని అమర్చనున్నారు.