
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరింత సంచలనంగా మారింది. ఆ వీడియోలో అమ్మాయిలు జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. అంతా శృంగారానికి సంబంధించిన డబుల్ మీనింగ్ కంటెంటే. ఈ వీడియోల్లో కనిపిస్తున్న వారు నిజమైన అమ్మాయిలు కాదని, AI సాయంతో వీటిని రూపొందించారని తేలింది. కొంత మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈ అశ్లీల కంటెంట్‌తో వీడియోలు రూపొందించి వైరల్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. మహిళలు బూతులు మాట్లాడుతున్నట్లు ఉన్న ఈ వీడియోలన్నీ ఏఐ టూల్స్‌తో రూపొందించినవేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.