ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26న కోనసీమ జిల్లా కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి మొంథా తుఫాను తర్వాత రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పంట పునరుద్ధరణ ఖర్చులు గురించి, ఆయన సమగ్రంగా అడిగి తెలుసుకోనున్నారు.. అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి.

