ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభోత్సవ వేడుకలను ఈసారి రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్ 4న ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సమయంలో చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతుల పట్ల గౌరవం, వారి కుటుంబాల పట్ల సానుభూతిని ప్రకటిస్తూ.. ఎటువంటి వినోద కార్యక్రమాలు లేకుండా లీగ్‌ను ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది.

