ఇరాన్‌లో ఉన్న భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచనలు చేసింది. ఇరాన్ నుంచి వెంటనే స్వదేశానికి రావాలని కోరింది. ఇరాన్ పర్యటనను రద్దు చేసుకోవాలని భారతీయులను కోరింది. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉండడంతో విదేశాంగశాఖ కీలక సూచనలు జారీ చేసింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఉండాలని సూచించారు. నిరసనలతో ఉద్రిక్తంగా మారిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. నిత్యం తమతో టచ్‌లో ఉండాలని చెప్పింది.

