ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. “ప్రస్తుత యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ ఆటగాళ్లు అమెరికాకు వస్తే, వారి ప్రాణాలకు లేదా భద్రతకు మేము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము. వారు ఈ వరల్డ్‌కప్‌కు దూరంగా ఉండటమే అందరికీ మంచిది” అని ట్రంప్ నేరుగా హెచ్చరించారు.

