ఇరాన్ నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. తొలి బృందాన్ని శుక్రవారం భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రయాణానికి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని టెహ్రాన్‌లోని భారత్ ఎంబసీ అధికారులు, విద్యార్థులను కోరినట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేత కారణంగా భారతీయులను సంప్రదించేందుకు ఇబ్బందిగా ఉందని పేర్కొంది. అయితే ఇరాన్లో దాదాపు 10వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా.

