ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ మిత్రదేశం ఇజ్రాయెల్ అమెరికాకు పెద్ద షాక్ ఇచ్చింది. గ్రౌండ్ ఆపరేషన్ కోసం తమ సైన్యం ఇరాన్ వెళ్లదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం, దేశ సరిహద్దుల్లో భద్రతను కాపాడుకోవడం, దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లాపై ఫోకస్ చేయడంతోన్ నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నామని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల గ్రౌండ్ ఆపరేషన్ మొత్తం భారం అమెరికాపై పడే అవకాశం ఉంది. కేవలం అమెరికానే రంగంలోకి దిగి ఇరాన్ సైన్యంతో పోరాడాల్సి ఉంటుంది.

