ఇరాన్ ప్రజలు తీవ్రమైన బాధలు అనుభవిస్తున్నారు. ఈ విషాద సమయంలో కాశ్మీర్ లోయలోని శ్రీనగర్, అనంతనాగ్, బడ్గాం నుంచి మొదలై కార్గిల్, లడఖ్ ప్రాంతాల వరకు చిన్న చిన్న సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత వారం నుంచి ఇక్కడికి వచ్చే విరాళాలు ఊపందుకున్నాయి. మహిళలు తమ బంగారు గొలుసులు, కమ్మలు, ఉంగరాలు, ముక్కులు స్వచ్ఛందంగా అందజేస్తున్నారు. “ఇది మా భాగస్వామ్యం, ఇరాన్ మన సోదర దేశం” అని ఒక మహిళ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

