పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న నేపథ్యంలో.. ఆయన మరణించారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో ఆయనకు ఏమైందో తెలుసుకోవాలని ఆయన సోదరీమణులు గొడవ చేస్తున్నారు. 71 ఏళ్ల సోదరి నొరీన్ నియాజీ.. తమను చీకట్లో జుట్టు పట్టుకుని నేలపై పడేసి, రోడ్డుపై లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు వారాలకు పైగా ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. ఈ దాడి ప్రణాళికాబద్ధమైన దౌర్జన్యం అని పీటీఐ పేర్కొంది.

