ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ రావల్పిండిలో అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురై ఉండొచ్చని పాకిస్తాన్‌లో ప్రచారం సాగుతుంది. బెలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహా అనేక సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారనే పోస్టులు కనిపించాయి. ఇమ్రాన్ ఖాన్‌ను ఐఎస్ఐ చంపి ఉండొచ్చని కూడా ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు పాకిస్తాన్ అధికారుల నుంచి ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు

