డ్రగ్స్ వినియోగాన్ని బీఆర్‌ఎస్ కూడా తీవ్రంగా ఖండిస్తుందని కేటీఆర్ తెలిపారు. నేను ఎప్పుడైనా డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని గుర్తుచేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ప్రతిపాదనను స్వాగిస్తున్నానని తెలిపారు. ఇక, ప్రతి డ్రగ్స్ కేసులో తన పేరును వాడటంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇకపై తన పేరును డ్రగ్స్ కేసులో అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.

