ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ బుధవారం ఉదయం నుండి తీవ్రమైన సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. వేలాది మంది వినియోగదారులు ఈ యాప్‌ను యాక్సెస్ చేయడంలో, దాని ఫీచర్లను ఉపయోగించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రియల్-టైమ్ అంతరాయాలను నిశితంగా గమనించే ‘డౌన్‌డెటెక్టర్’ వెబ్సైట్ గణాంకాల ప్రకారం, మార్చి 11 ఉదయం నుండి ఇన్స్టాగ్రామ్ పనితీరుపై ఫిర్యాదులు ఒక్కసారిగా పెరిగాయి

