ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక, కీలకమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతిబింబమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

