బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని అగ్రనేతలందరూ సర్వశక్తులు ఒడ్డినా.. ‘బంగ్లా’ ప్రజల మనసు గెలుచుకోవడంలో మమతా బెనర్జీ మరోసారి తన మార్క్ చూపించారు. పశ్చిమ బెంగాల్లోని 294 స్థానాలకు పీపుల్స్ పల్స్ సర్వే అంచనాల ప్రకారం.. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఏకంగా 177-187 స్థానాలను కైవసం చేసుకోబోతోంది. మరోవైపు అధికారం కోసం సర్వశక్తులూ ఒడ్డిన బీజేపీ 95-110 స్థానాలకే పరిమితం కానుంది. కాంగ్రెస్ (1-3), వామపక్షాలు (0-1) నామమాత్రపు ఉనికిని మాత్రమే చాటుకోబోతున్నాయి.

