
తాజాగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ పైరసీ ముఠాలను అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను టాలీవుడ్ సినీ పెద్దలకు పోలీసులు వివరించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పైరసీ ముఠాలకు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాం. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాను పట్టుకున్నాం’ అని సీవీ ఆనంద్ చెప్పుకొచ్చారు.