ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్.. డ్రోన్ దాడుల ను తీవ్రతరం చేసింది. తన పొరుగుదేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు చేసింది. ఒక డ్రోన్ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు ప్రకటించారు.

