
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అధికారులు తెలిపిన ప్రకారం ఈ రోజు ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో రద్దీ పెరిగి, సాయంత్రం వరకు 90,002 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసేంత వరకు భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.