
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై విపక్ష ‘ఇండియా’ కూటమి మధ్య అవగాహన కుదిరింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నివాసంలో శనివారంనాడు జరిగిన సమావేశంలో ఈ మేరకు భాగస్వామ్య పక్షాల మధ్య ఒక అవగాహన కుదిరినట్టు పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అహ్లాదకరమైన వాతావరణంలో సమావేశం జరిగిందని, సీట్ల పంపకాలపై భాగస్వామ్య పార్టీలు ఒక విస్తృత అవగాహనకు వచ్చాయని సమావేశానంతరం బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ తెలిపారు.