
హెచ్సీఎల్ టెక్నాలజీస్(HCL) టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. M3M హురున్ ఇండియా విడుదల చేసిన జాబితాలో2025లో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్నీ నాడార్ నిలిచింది, ఇండియాలోనే టాప్ 10 కుబేరుల జాబితాలో ఈమె అతి పిన్న వయస్కురాలు. రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ ఏకంగా రూ.2.84 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో ఆమె భారత మహిళా పారిశ్రామికవేత్తల్లో మొదటి స్థానంలో నిలిచారు.