
తెనాలి రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారు.. స్థానికులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుంటూరు ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా తెనాలిలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయనే నేరుగా రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి, ప్రస్తుతం వారి ప్రవర్తనపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ వెళుతున్నారా లేదా అనే విషయాన్ని, వాళ్ళ ప్రవర్తనను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు.
- 0 Comments
- Guntur District