నటుడు, తమిళ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తన తండ్రి ఇంటి పేరు తొలగించుకున్నాడు.జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సిగ్మా ఈ చిత్రం టైటిల్ కార్డులో తన తండ్రి విజయ్ ఇన్షియల్ ఇంటి పేరు)ను తొలగించడంతో పాటూ తన తల్లి పేరు సంగీత ఇన్షియల్ వచ్చే విధంగా ఎస్ చేర్చుకున్నారు. ఇంతకు ముందే తన ఇన్ స్ట్రాగ్రామ్లో తండ్రి విజయ్ ఫాలోవర్స్ నుంచి వైదొలిగారు. ఇప్పుడీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

