దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘోర బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్లీపర్ కోచ్ బస్సులను తక్షణమే రోడ్లపై నుంచి పక్కన పెట్టేయాలని NHRC అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.స్లీపర్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని.. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

