
సుపరిపాలన తొలి అడుగు సభలో ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించిన ఈ సభలో ప్రోటోకాల్ నిబంధనలను ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను కూడా ఆహ్వానించాలని రఘురామ కోరారు.