భారత్ ఎయిర్‌లైన్స్ వాడే ఎయిర్‌బస్ ఏ320 (Airbus A320) విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్య (Software glitch) ను పరిష్కరించినట్లు డీజీసీఏ (DGCA) ఆదివారం వెల్లడించింది. మొత్తం 323 విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసినట్లు తెలిపింది.
భారత్ ఎయిర్‌బస్‌కు చెందిన ఏ320 రకం విమానాలు 338 వినియోగిస్తోంది. సూర్యుడి వేడి కారణంగా ఎయిర్‌బస్ ఏ320 విమానాల్లో సాఫ్ట్వేర్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఇవి ప్రధానంగా ఇండిగో, ఎయిరిండియా, ఇండియా ఎక్స్‌ప్రెస్ వద్ద ఉన్నాయి.

