వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని, తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సిఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరూ టీమ్‌గా పని చేశామని, కష్టంకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. మరో రెండో రోజులు ఇలానే పని చేస్తే మరింద ఊరట ఇవ్వగలుగుతామని, మంత్రులు అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు.

