
పవన్ కల్యాణ్ విశాఖపట్నానికి వచ్చిన సమయంలో ఆయన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేయడం వల్ల దాదాపు 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష రాయలేకపోవడానికి గల కారణాలపై విచారణ జరిపించాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. పెందుర్తి ప్రాంతంలో కొందరు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోవడానికి తన కాన్వాయ్ కారణమంటూ వచ్చిన వార్తలపై సమగ్ర నివేదిక అందజేయాలని అన్నారు.