
మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన ప్రదర్శనపై గర్వంగా ఉందని హారిస్ రౌఫ్ భార్య ముస్జా మనూఫ్ కామెంట్స్ చేయడంతో ఈ రచ్చ మరింత ముదిరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో “గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం” అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీమిండియా అభిమానులు స్పందిస్తూ.. ఆమెకు ఘాటుగానే సమాధానమిస్తున్నారు. మీ బుద్ధి ఎప్పటికీ మారదు అని ఎత్తిచూపారు. అలాగే, యుద్ధమైనా, ఆటైనా గేలిచేది భారత్.. ఓడిపోయేది పాకిస్తాన్ అంటూ చురకలంటిస్తున్నారు.
క్రీడల్లో పాకిస్తాన్ ప్లేయర్లు ఇలా చేయడం పై క్రికెట్ లవర్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి.