
పహల్గామ్ ఉగ్రదాడులలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరు పాకిస్థానీ జాతీయులు అని భద్రతా బలగాలు ప్రాధమికంగా గుర్తించాయి. ఉగ్రవాదుల నమూనా రూపాలను తెలిపే స్కెచ్లను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఒక్కరోజు క్రితమే విడుదల చేశాయి. ఆచూకిని తెలిపే సమాచారం అందించిన వారికి రూ 20 లక్షల రివార్డును ప్రకటించారు. ఇద్దరిలో ఒక్కరు హషీం మూసా అలియాస్ సులేమాన్ మరొక్కడు అలీ భట్ అలియాస్ తహా భట్ అని అధికారులు తెలిపారు. ఇక మూడో టెర్రరిస్టు భారతీయ పౌరుడు అబ్దుల్ హుస్సేన్ థోకర్ అని గుర్తించారు.