
వారం రోజుల క్రితం తల తిరగడంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోలుకున్నారు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రి నుంచి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్ డిశ్చార్జి అయ్యారు.
ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. అ తర్వాత ఆయన యాధావిధిగా తన బాధ్యతల్లో మునిగిపోవచ్చు’ అని డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ అనిల్ బీజీ మీడియాకు తెలిపారు.