ఆశా భోస్లే అస్తమయం భారతీయ సంగీత రంగానికి ఎన్నటికీ తీరని లోటు అని పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించిన ప్రధాని మోదీ, ఆశా జీ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని రాసుకొచ్చారు. భారతదేశం గర్వించదగ్గ అత్యంత గొప్ప, బహుముఖ స్వరాల్లో ఆమె ఒకరని ప్రశంసించారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రయాణం మన సాంస్కృతిక వారసత్వాన్ని మరింత సుసంపన్నం చేసిందని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

