లార్జ్ క్యాప్ కేటగిరిలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్టాక్ అదరగొట్టింది. క్రితం రోజు ట్రేడింగ్ సెషన్లో 2 శాతానికి పైగా లాభపడి సరికొత్త ఆల్ టైమ్ హై స్థాయి రూ. 953.40 మార్క్ తాకింది. ప్రభుత్వ బ్యాంకుల్లో విదేశీ పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజుల నుంచి బ్యాంకింగ్ రంగంలోని షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. అది ఎస్బీఐ బ్యాంక్ షేరుకు కలిసొస్తుందని చెప్పవచ్చు.

