
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, సమ్మె యోచనను విరమించుకోవాలని ఆర్టిసి యాజమాన్యం సూచించింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టిసిలో సమ్మెలు నిషేధమని, సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమని పేర్కొంది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీకుంటామని యాజమాన్యం హెచ్చరించింది.