
అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ కీలకమైన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కోటికిపైగా ఉన్న యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు అనువుగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోపు ప్రత్యేక చట్టం తెస్తామని, 20 నెలల్లో ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని తేజస్వి ప్రతిజ్ఞ చేశారు.