అక్రమ మైనింగ్ కారణంగా ఆరావళి పర్వతాలకు జరుగుతున్న నష్టంపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆరావళి పర్వతాల్లో మైనింగ్, ఇతర అంశాలపై ఈ కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తుందని పేర్కొంది. నిపుణుల కమిటీ కోసం మైనింగ్‌పై అనుభవం ఉన్న పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను నాలుగు వారాల్లో సూచించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య, అమికస్ క్యూరీ కె.పరవేశ్వర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. నిపుణుల కమిటీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

