
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవి, అబద్ధమని ఈసీ పేర్కొన్నది. ఓట్లను ఆన్లైన్ డిలీట్ చేయలేరని ఎన్నికల సంఘం చెప్పింది. ఆన్లైన్ పద్ధతిలో ప్రజలు ఓట్లను డిలీట్ చేయడం కుదరదని, రాహుల్ గాంధీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, జ్ఞానేశ్ కుమార్ ఆర్నెళ్ల క్రితం సీఈసీగా బాధ్యతలు చేపట్టారని, కానీ ఏడాది క్రితం అక్రమాలు జరిగినట్లు రాహుల్ ఆరోపించినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.