
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన విద్యార్థులు కొలనుపాక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఉదయం బస్సు రాకపోవడంతో గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు కాలేజీ విద్యార్థులు,
మరో ఇద్దరు ఇతరులు ఆటో ఎక్కారు. కొలనుపాక గ్రామ పరిధిలో ఆటో ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం జరగకపోయినప్పటికీ బస్సు వచ్చి ఉంటే ప్రమాదం తప్పేదని గ్రామస్తులు ఆరోపించారు.