హైదరాబాద్ ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డ్రైవర్లు చేపట్టిన ఈ ధర్నా సుమారు గంటకు పైగా కొనసాగడంతో పరిసర ప్రాంతాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఒక ఆటో డ్రైవర్ డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆటో మీటర్ ఛార్జీలను తక్షణమే పెంచాలని, అలాగే ఇతర జిల్లాల ఆటోలకు హైదరాబాద్ నగరంలోకి అనుమతి ఇవ్వకూడదని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

