
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర పరిధిలో మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేయాలని ఆదేశాలనే జారీ చేశాయి. ఈ నిర్ణయంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఉత్తర్వులను అవివేకమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవిగా అభివర్ణించారు. మాంసం తినడానికి, స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సంబంధం ఏమిటని ఓవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.